ఒకేరోజు 15 సీసాల రక్తం దానం చేశానన్న ఒవైసీ..ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు

ఒకేరోజు 15 సీసాల రక్తం దానం చేశానన్న ఒవైసీ..ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు
x
Highlights

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రక్తదానం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తాను...

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రక్తదానం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తాను ఒక్కరోజే 15 బాటిళ్ల రక్తం ఇచ్చానని చెప్పడంపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మనిషికి ఇది సాధ్యమేనా అన్న సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార ర్యాలీలో పాల్గొన్న హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వైద్యపరమైన సందేహం లేవనెత్తేలా ప్రసంగించారు. ఈ సందేహం ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ సందర్భంలో తాను ఒకే రోజు 15 సీసాల రక్తం దానం చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది.

రక్తదానం గురించి ప్రస్తావించిన ఒవైసీ.. ''ఒక చోట జరిగిన గందరగోళంలో ఓ వ్యక్తికి రక్తం అవసరమైందని, 'ఇక్కడ ఎవరిదైనా ఓ-పాజిటివ్‌ రక్తమా' అని డాక్టర్‌ అడిగారని చెప్పారు. వెంటనే నాది అదే గ్రూపు రక్తమని చెప్పానని, ఆ రోజు నేను ఒకటి కాదు 15 బాటిళ్ల రక్తం ఇచ్చానని చెప్పారు. దీనికి దేవుడే సాక్ష్యమన్నారు. వాటిని పట్టుకొని రోగి ఉన్న పడక వద్దకు పరిగెత్తానని అన్నారు.

అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. మనిషికి ఇది ఎలా సాధ్యపడుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మనిషి శరీరంలో 4.5 లీటర్ల నుంచి 5.5 లీటర్ల రక్తమే ఉంటుందని, ఈయన 15 బాటిళ్ల రక్తం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 15 సీసాల రక్తం అంటే 7.8 లీటర్లు కావాలని కామెంట్లు చేశారు. మరికొందరు ఇది నిజంగా వైద్య శాస్త్రంలో అంతుచిక్కనిదని ఎద్దేవా చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories