
డిల్లీ ముఖ్యమంత్రిగా ఆదివారం రామ్‌లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
డిల్లీ ముఖ్యమంత్రిగా ఆదివారం రామ్‌లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన సుమారు సుమారు లక్ష మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ చెప్పారు. 4,5,6,7,8 మరియు 9 నుండి వారిని అనుమతిస్తారని తెలిపారు. సుమారు 5,000 మంది పోలీసు సిబ్బంది, 125 సిసిటివి కెమెరాలు, 12 ఎల్‌ఇడి స్క్రీన్లు, 45,000 కుర్చీలు ఉంటాయని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రజలు నిలబడి ఈ కార్యక్రమాన్ని చూడటానికి తగినంత స్థలం ఉంటుందని అధికారి తెలిపారు.
"కేజ్రీవాల్ నగరంలోని ప్రజలందరికీ ప్రియమైన వ్యకి అని మరోసారి రుజువైంది. కాబట్టి ఆయన ప్రాణాస్వీకారానికి రావలసిందిగా నగర ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం" అని గోపాల్ రాయ్ చెప్పారు. కాగా కేజ్రీవాల్ మూడోసారిరామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీకి చెందిన ఏడుగురు లోక్సభ ఎంపీలు, కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది బిజెపి శాసనసభ్యులను కూడాఆహ్వానించారు. అలాగే ఢిల్లీ మునిసిపల్ కౌన్సిలర్లందరినీ ఆహ్వానించింది ఆప్. కొత్త క్యాబినెట్ కూడా ఈ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే, నేడు అనేక ప్రాజెక్టులను ప్రారంభించడానికి మోదీ తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసిని సందర్శించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ వెలుపల నుండి రాజకీయ నాయకులనుమాత్రం ఆహ్వానించలేదు. కానీ ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ముఖ్యులను ఆహ్వానించినట్టు అని ఆప్ నాయకుడు జాస్మిన్ షా చెప్పారు.ఈ కార్యక్రమానికి విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయులను కూడా కేజ్రీవాల్ ఆహ్వానించారు. అయితే ఉపాధ్యాయులు ఖచ్చితంగా పాల్గొనాల్సిన పని లేదని.. వీలు కుదిరితేనే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని సూచించింది. అలాగే ఆప్ పాలనకు సహకరిస్తున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రతినిధులను కూడా ఆహ్వానించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



