Goa Polls: పారికర్ తనయుడికి బీజేపీ మొండిచేయి.. కేజ్రీవాల్‌ ఆఫర్‌!

Goa Polls: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాకిచ్చింది.

Arun Chilukuri
Updated on: 20 Jan 2022 6:21 PM IST
Arvind Kejriwal Offer To Manohar Parrikars Son
X

Goa Polls: పారికర్ తనయుడికి బీజేపీ మొండిచేయి.. కేజ్రీవాల్‌ ఆఫర్‌!

Goa Polls: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాకిచ్చింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఉత్పల్ పారికర్‌కు చోటు దక్కలేదు. దీనిపై స్పందించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉత్పల్ పారికర్‌కు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. బీజేపీ 'యూజ్ అండ్ త్రో' పాలసీతో గోవా ప్రజలు కూడా బాధపడుతున్నారని ట్వీట్ చేసిన కేజ్రీవాల్ ఆప్ అభ్యర్ధిగా పోటీ చేయాలని ఉత్పల్‌ పారికర్‌ను ఆహ్వానించారు.

పారికర్‌ కుటుంబం పట్ల బీజేపీ అవలంబించిన తీరు గోవా ప్రజల్ని ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. మనోహర్‌ పారికర్‌ అంటే తనకు ఎల్లప్పుడూ ఎంతో గౌరవమని తెలిపారు. ఉత్పల్‌ తమ పార్టీలో చేరి ఆప్‌ టికెట్‌పై పోటీ చేసేందుకు సాదరంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story