Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు

Arvind Kejriwal Allegations against investigative Agencies
x

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు

Highlights

Arvind Kejriwal: నా పేరు చెప్పాలంటూ మనీష్‌ సిసోడియాపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోర్టుకు... సీబీఐ, ఈడీ తప్పుడు సమాచారం ఇస్తున్నాయని ఆరోపించారు. ఈడీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని టార్చర్ చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో అరెస్టయిన వారిని.. దర్యాప్తు సంస్థలు టార్చర్ పెట్టీ వేధిస్తున్నాయన్నారు. 100 కోట్ల రూపాయలు అంటారు.. ఒక్క పైసా దొరకలేదని... రేపు సీబీఐ ముందు మోడీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెప్తే నమ్ముతారా? విచారణ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. కొత్త పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందన్న కేజ్రీవాల్.. లిక్కర్ స్కాం అనేదే లేదన్నారు. కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories