Amarnath Yatra 2022: అమర్‌నాథ్‌ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం

Arrangements For the Amarnath Yatra
x

Amarnath Yatra 2022: అమర్‌నాథ్‌ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం

Highlights

Amarnath Yatra 2022: యాత్రికులకు సదుపాయాలు కల్పిస్తున్న జమ్ముకశ్మీర్ సర్కార్

Amarnath Yatra 2022: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర కోసం జమ్ముకశ్మీర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల కోసం పహల్గామ్‌లోని చందన్‌వారిలో వైద్య శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు. బాల్టాల్, పహల్గాం ప్రయాణ మార్గాలలో యాత్రికుల కోసం టెంట్లు వేస్తున్నారు. ఈ బేస్ క్యాంపులలో వసతి, వైద్య సంరక్షణ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వాతావరణ అంచనా, అత్యవసర ప్రతిస్పందన, అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

ఆగస్ట్ 11 వరకు 6 వారాలపాటు కొనసాగనున్న అమర్ నాథ్ తీర్థయాత్రకు అవసరమైన ప్రాథమిక అవసరాలన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తోంది. మరోవైపు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ సౌకర్యాలు కూడా ప్రతిచోటా అందుబాటులో ఉంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories