కరోనా ఉదృతి ఉన్న చోట్ల ఇంటింట పరీక్షలకు ఏర్పాట్లు!

కరోనా ఉదృతి ఉన్న చోట్ల ఇంటింట పరీక్షలకు ఏర్పాట్లు!
x
Highlights

లాక్ డౌన్ తరువాత కరోనా మరింత ఉగ్రరూపం దాల్చుతుందనే చెప్పాలి.

లాక్ డౌన్ తరువాత కరోనా మరింత ఉగ్రరూపం దాల్చుతుందనే చెప్పాలి. అప్పట్లో వందల్లో ఉండే కేసులు ఒక్కసారే వేలల్లోకి పెరిగాయి. వీటి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ఆన్ లాక్ 01ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వే చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీటిని ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ల ను ఎంపిక చేసింది. మరో రెండు రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

కోవిడ్‌-19 భూతం కోర‌ల్లో చిక్కుకున్ని భార‌త్ వ‌ణికిపోతోంది. దేశంలో ప‌డ‌గ విప్పుతున్న క‌రోనా వైర‌స్ ప్రతాపం చూపెడుతోంది. రోజురోజుకూ వైర‌స్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో న‌మోదుకావ‌డం దేశంలో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా, కొన్ని జిల్లాల్లోనే కరోనా ఉధృతి కొన‌సాగుతుండ‌టం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి హాట్ స్పాట్లు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ 10 రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న 10 రాష్ట్రాల్లో 45 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌రిధిలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంట్లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్, హ‌ర్యానా, గుజ‌రాత్‌, జ‌మ్మూకాశ్మీర్, క‌ర్ణాట‌క‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లోని 45 మున్సిపాలిటీల్లో ఇంటింటి స‌ర్వే, ర్యాపిడ్ టెస్టుల‌ను కేంద్రం చేయ‌నుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories