Army JCO killed Pakistan firing along LoC : జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పులు.. జెసిఓ మృతి..

Army JCO killed Pakistan firing along LoC : జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పులు.. జెసిఓ మృతి..
x
Highlights

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ ఎప్పటికి మారవు.. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా..

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ ఎప్పటికి మారవు.. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పదే పదే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది పాక్.. మరోసారి పాకిస్థాన్ చేసిన దుశ్చర్యకు జూనియర్ కమిషన్డ్ అధికారి (జెసిఓ) మరణించారు. రాజౌరి జిల్లాలోని కెర్రీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కేరీ సెక్టార్‌లోని ఫార్వర్డ్ పోస్టులపై కాల్పులు జరిపినట్లు ఇందుకు భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకున్నట్లు వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం, నియంత్రణ రేఖపై పాకిస్తాన్ కాల్పుల్లో సైనిక ఉప జిల్లా అధికారి అమరవీరుడు అయినా సంగతి తెలిసిందే. నౌషెరాలోని నియంత్రణ రేఖ, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసింది.

పాకిస్తాన్ కాల్పుల్లో నైబ్ సుబేదార్ రాజ్‌వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారని.. అనంతరం ఆయన మరణించారు.. భారత సైన్యం ప్రో (డిఫెన్స్) లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపారు. ఇదిలావుంటే పాకిస్తాన్ ఈ ఏడాది 2700 కన్నా ఎక్కువ సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. ఈ సంఖ్య గత సంవత్సరం 3,168, 2018 లో 1,629 ఉంది.. ఈ సమయంలో మొత్తం 21 మంది పౌరులు మరణించగా, 94 మంది గాయపడ్డారు. బుద్గాంలో నలుగురు లష్కరే తోయిబా సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories