లఢక్‌లో తీవ్ర విషాదం.. ఆరుగురు సైనికుల మృతి

లఢక్‌లో తీవ్ర విషాదం.. ఆరుగురు సైనికుల మృతి
x
Highlights

లఢక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ ఘటన సముద్ర మట్టానికి 18వేల...

లఢక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ ఘటన సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద జరిగింది. మంచు చరియలు విరిగి పడటంతో నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక మరణించినట్టు ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఉత్తర హిమానీనదంలో ఆర్మీ స్థానానికి హిమపాతం తగిలిందని.. దాంతో ఈ ఘోరం సంభవించిందని.. ఆర్మీ దళాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాయన్నారు. ఆ సమయంలో 18వేల అడుగుల ఎత్తులో సైనికులు ఉన్నారని.. పైగా గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని.. దీంతో ప్రమాద సమయంలో ఆక్సిజన్ అందక సైనికులు చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories