SEBI: ఐపీవోలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా.. మే 1 నుంచి కొత్త నిబంధనలు..!

Are You Investing Money in IPO SEBI Latest Circular on IPO and UPI Payment
x

SEBI: ఐపీవోలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా.. మే 1 నుంచి కొత్త నిబంధనలు..!

Highlights

SEBI: ఐపీవోలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా.. మే 1 నుంచి కొత్త నిబంధనలు..!

SEBI: IPOలో పెట్టుబడి పెట్టే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పెద్ద మార్పు చేసింది. ఇది చిన్న పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సెబీ సర్క్యులర్‌ ప్రకారం.. 'ఐపీఓ కోసం బిడ్డింగ్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లందరూ రూ. 5 లక్షల వరకు బిడ్డింగ్ చేయడానికి యూపీఐ చెల్లింపును ఉపయోగించవచ్చు. వారు తమ UPI IDని వారి అప్లికేషన్ (బిడ్-కమ్-అప్లికేషన్) ఫారమ్‌లో అందించవచ్చు. ఈ నియమం మే 1 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈ కొత్త వ్యవస్థ కోసం ఎన్‌పిసిఐ తన సిస్టమ్ తయారీని సమీక్షించిందని ఈ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. దీంతో పాటు దాదాపు 80% ఇంటర్మీడియట్ సంస్థలు కూడా కొత్త నిబంధనల ప్రకారం మార్పులు చేయడానికి ధృవీకరించాయి. UPI చెల్లింపు లావాదేవీ నియమాలను NPCI మార్చిన 4 నెలల తర్వాత SEBI ఈ నిర్ణయం తీసుకుంది. NPCI ప్రతి లావాదేవీకి పరిమితిని UPI నుంచి రూ. 2 లక్షలకు తగ్గించింది. అదే సమయంలో IPOలో పెట్టుబడి కోసం UPI ద్వారా చెల్లింపు చేయడానికి SEBI 2018లోనే అనుమతిని ఇచ్చింది. ఇది జూలై 1, 2019 నుంచి అమలులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీవోను వచ్చే మే నెల తొలినాళ్లలో జారీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్లతో ప్రభుత్వం చర్చిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మార్చి 31లోగా ఎల్‌ఐసీ ఆఫర్‌ను తీసుకురావాలన్న గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం కారణంగా మార్కెట్లో ఏర్పడ్డ ఒడిదుడుకులతో ఐపీవో వాయిదా పడిన సంగతి తెలిసిందే. 7 శాతం వాటా ఐపీవో ద్వారా విక్రయించి, రూ.50,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories