కేసు మరో మలుపు తిరిగిన నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు

admin1
Published on: 2 Feb 2020 7:04 AM IST
కేసు మరో మలుపు తిరిగిన నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు
X
నిర్భయ నిందితులు

నిర్భయదోషుల ఉరిశిక్ష అమలు కేసు మరో మలుపు తిరిగింది. దోషుల ఉరిశిక్ష అమలుపై ప్ర్రత్యేకకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి డీఎన్‌ పటేల్‌ విచారించారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నలుగురు దోషులు చట్టంతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దోషులందరూ ఒక మాట మీద నిలబడి ఎలాగైనా శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

admin1

admin1

Next Story