Kerala: కేరళను భయపెడుతున్న మరో కొత్త వైరస్

Another New Virus Threatening in Kerala
x

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ ఇండియా


Highlights

Kerala: కేరళలోని పాలక్కడ్‌లో ఏడాది వయసు కలిగిన చిన్నారికి తొలి షిగెల్లా వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.

Kerala: ప్రపంచమంతా కరోనాతో తగ్గుముఖంపడుతున్న సమయంలో రోజుకో రకం కొత్త వైరస్ ఎక్కడో చోట పుట్టుకొస్తూనే వుంది. వైరస్ ల యుగం రానుందా అని అనుమానం కలుగుతోంది. దక్షిణ రష్యాలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకగా, మన దేశంలో కొత్తగా కేరళలోని పాలక్కడ్‌లో ఏడాది వయసు కలిగిన చిన్నారికి తొలి షిగెల్లా వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సాంక్రమిక బ్యాక్టీరియా 'షిగెల్లా' బారినపడి 11 ఏళ్ల చిన్నారి కేరళలోరి కోజికోడ్‌లో మృతిచెందాడు. ఆ బాలుడు రెండు రోజుల కిందట షిగెల్లాతో ప్రాణాలు కోల్పోగా.. ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. 'షిగెల్లా' లక్షణాలైన.. జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలతో దాదాపు 20 మంది శనివారం వివిధ ఆస్పత్రుల్లో చేరారు..బాలుడు మృతిచెందిన తర్వాత ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన కొందరు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని కోజికోడ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ తెలిపారు. జ్వరం, స్వల్పంగా డయోరియా లక్షణాలతో శనివారం 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. వీరిలో చాలా మంది ఆ బాలుడితో సన్నిహితంగా మెలిగినవారేనని ఆమె వివరించారు.

గతేడాది కీజపయూర్‌లోని వెస్ట్ లోయర్ ప్రైమరీ పాఠశాలలోని 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు షిగెల్లా నిర్ధారణ అయ్యింది. చికిత్స తర్వాత వీరు కోలుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా నీటిలో ఉన్నట్టు అధికారులు అప్పట్లో గుర్తించారు. షిగెల్లా బారిపడ్డ వ్యక్తులకు తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. ప్లాస్మోడియం ఒవేల్ అనే కొత్త మలేరియాను సూడాన్ నుంచి వచ్చిన సైనికుడిలో కేరళ అధికారులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories