ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మరోసారి విచారణ

* దినేశ్ అరోరా ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో పురోగతి.. తెరవెనుక తతంగం నడిపిన రాజకీయ ప్రముఖుల చుట్టూ ఉచ్చు

R Tripura Malini
Published on: 14 Nov 2022 9:45 AM IST
Another hearing in the Delhi liquor scam case today
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మరోసారి విచారణ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మరోసారి విచారణ జరగనుంది. అందులో భాగంగా ట్రయల్ కోర్టులో దినేశ్ అరోరా అప్రూవర్ స్టేట్మెంట్‎ను సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి నమోదు చేయనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దినేశ్ అరోరా నిందితుడుగా ఉన్నారు. అప్రూవర్‌గా మారిన తర్వాత అతన్ని సాక్షిగా పరిగణించే అవకాశం ఉంది. దినేశ్ అరోరా ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో మరింత పురోగతి వస్తుందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. తెరవెనుక తతంగం నడిపిన రాజకీయ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగియనుంది. లిక్కర్ స్కామ్ కేసులో దినేశ్ అరోరా స్టేట్మెంట్ కీలకం కానుంది. దాని ఆధారంగా అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ భవితవ్యం తేలనుంది. సాయంత్రం 4 గంటలకు బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టు నిర్ణయం వెలువరించనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story