భారతీయుల కోసం చైనాకు బయలుదేరిన మరో విమానం

భారతీయుల కోసం చైనాకు బయలుదేరిన మరో విమానం
x
Highlights

చైనాలోని కరోనావైరస్ వ్యాప్తికి నిలయమైన వుహాన్ నుంచి భారతీయులను తరలించడానికి మరో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చైనాకు బయలుదేరింది.

చైనాలోని కరోనావైరస్ వ్యాప్తికి నిలయమైన వుహాన్ నుంచి భారతీయులను తరలించడానికి మరో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చైనాకు బయలుదేరింది. ఈరోజు తెల్లవారుజామున 324 మంది ప్రయాణికులతో తొలి విమానం భారత రాజధానిలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల తర్వాత శనివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం నుంచి మరో విమానం వుహాన్ కు బయలుదేరిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రతినిధి శనివారం మాట్లాడుతూ.. మరొక విమానం ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు ఢిల్లీ నుండి వుహాన్కు వేరే సిబ్బందితో, ఇతర వైద్యులతో అదే వైద్యుల బృందంతో బయలుదేరిందన్నారు.

రెస్క్యూ బృందానికి మరోసారి ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్ కెప్టెన్ అమితాబ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. అని పేర్కొన్నారు. మొదటి విమానంలో - వుహాన్ నుండి 324 మంది ప్రయాణికులను తరలించగా.. వీరిని తీసుకురావడానికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి ఐదుగురు వైద్యులు, ఒక పారామెడికల్ సిబ్బంది, ఐదుగురు కాక్‌పిట్ సిబ్బంది, 15 మంది క్యాబిన్ సిబ్బంది పనిచేశారు. 324 మంది ప్రయాణికుల్లో 211 మంది విద్యార్థులు, 110 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్, ముగ్గురు మైనర్లు ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా చైనాలోని వుహాన్ ప్రాంతంలో ఏకంగా 200 మందికి పైగా కరోనావైరస్ దాటికి మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories