Congress: కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. భారీగా ఐటీ నోటీసులు

Another Big Shock For Congress Massive IT Notices To Congress
x

Congress: కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. భారీగా ఐటీ నోటీసులు

Highlights

Congress: రూ.1700 కోట్లు లావాదేవీలపై నోటీసులు జారీ

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆదాయ పన్ను శాఖ.. కాంగ్రెస్‌ పార్టీకి పన్ను నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లపాటు రీఅసెస్‌మెంట్‌ ప్రొసిడింగ్స్‌ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటిరోజే.. ఆదాయ పన్ను శాఖ రూ.1700 కోట్ల బకాయి పన్ను రికవరీ చేయాలని నోటీసులు ఇవ్వడం విశేషం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్ తన్ఖా వెల్లడించారు. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాలని నోటీసులో పేర్కొంది.

నాలుగేళ్లపాటు రీఅసెస్‌మెంట్‌ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్న శాఖ ఆదేశాలను సవాల్‌ చూస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను నిన్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తిరస్కరించింది. రీఅసెస్‌మెంట్‌ ప్రక్రియ చేపట్టేందుకు తగిన అధికారాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయని.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక.. 2014-15, 2015-16, 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి..రీఅసెస్‌మెంట్‌ ప్రొసిడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 22న కోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories