Corona: చెన్నైకి క్యూ కడుతోన్న ఏపీ కరోనా బాధితులు

Andhra People Rush to Chennai for Covid Treatment
x

కరోనా రోగులు (ఫైల్ ఇమెజ్)

Highlights

Corona: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా బాధితులు చికిత్స కోసం చెన్నైకి పరుగులు పెడుతున్నారు.

Corona: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాచింది. రోజు రోజూకు విస్తరిస్తూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా, వందల సంఖ్యలో బలౌతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులు చెన్నై బాటపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌440కే మ్యుటెంట్‌ ఉనికిని ఉందని, ఇది అత్యంత ప్రమాదికారని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా రెండోరోజు 20వేలకి పైగా కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. గురువారం కొత్తగా 21,954 కరోనా కేసులు నమోదు కాగా 72 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. 8,446 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా బాధితులు చికిత్స కోసం చెన్నైకి పరుగులు పెడుతున్నారు. ఏపీలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడం వల్లనో.. అక్కడ చికిత్స అందుతుందన్న నమ్మకం లేకనో.. అక్కడి నుంచి చెన్నై ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. ఆక్సిజన్‌ అందని స్థితిలో అంబులెన్సుల్లో అక్కడి నుంచి తమిళనాడు రాజధానికి చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని ఏ ఆస్పత్రిలో చూసినా సగం మందికిపైగా ఏపీ వారే కనిపిస్తున్నారు. అపోలో వంటి ప్రముఖ ఆస్పత్రి నుంచి చిన్నాచితకా ఆస్పత్రులు సైతం ఏపీ కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

ఇదే అదనుగా కొందరు వివిధ మార్గాల్లో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. బాధితుణ్ని ఒంగోలు నుంచి చెన్నైకి తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌ వారు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు మరింత పెరిగిపోతోంది. నిజానికి సాధారణ రోజుల్లో అక్కడి నుంచి చెన్నైకి వచ్చేందుకు రూ.20 వేల వరకు వసూలు చేస్తారు. ఇక అంబులెన్సుతో పాటు రోగికి సరఫరా చేసే ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు వారు అడిగినంత మొత్తం ఇస్తుండగా పేదలు మాత్రం అక్కడే ఆశలు వదులుకుంటున్నారని కొందరు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories