కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి
x
Representational Image
Highlights

కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ కోలుకున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి ముంబైలోని ఆసుపత్రిలో మరణించినట్లు నగర పౌర సంస్థ సోమవారం తెలిపింది.

కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ కోలుకున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి ముంబైలోని ఆసుపత్రిలో మరణించినట్లు నగర పౌర సంస్థ సోమవారం తెలిపింది. ఈ వ్యక్తి మొదట్లో కరోనావైరస్ కోసం పాజిటివ్ రావడంతో, స్ధానిక కస్బూర్బా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 14 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అనంతరం నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఆదివారం అర్థరాత్రి ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఈ విషయాన్నీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి మధుమేహం, ఆస్త్మా, శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన ప్రైవేటు ఆస్పత్రికి చేర్చారు. ఈ జబ్బులక వల్లే అతను మృతి చెందాడని కోవిడ్‌-19తో మరణించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అతని మరణం అనంతరం ఫిలిప్పీన్స్‌ లోని వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వడానికి కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories