బలహీనపడుతున్న ఉంపన్ తుపాను.. అక్కడ 12 మంది మృతి..

బలహీనపడుతున్న ఉంపన్ తుపాను.. అక్కడ 12 మంది మృతి..
x
Highlights

ఉంపన్‌ తుపాను బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే..

ఉంపన్‌ తుపాను బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే.. సాగర్ ఐల్యాండ్స్‌కు 35 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుఫాను బెంగాల్‌ తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అయితే ఈ తీవ్రమైన తుఫాను ప్రస్తుతం మందగించడం ప్రారంభించింది. గత 6 గంటల్లో ఇది గంటకు 27 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని భావిస్తున్నారు.

అస్సాం, మేఘాలయలో నేడు తేలికపాటి వర్షం , గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఒడిశాలోని 9 జిల్లాలు పూరి, గంజాం, జగత్సింగ్‌పూర్, కటక్, కేంద్రాపాడ, జాజ్‌పూర్, గంజాం, భద్రక్ మరియు బాలసోర్. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్, 24 దక్షిణ మరియు ఉత్తర పరగణాలతో పాటు హౌరా, హూగ్లీ, వెస్ట్ మిడ్నాపూర్ , కోల్‌కతా తీరప్రాంత జిల్లాలు తుఫానుకు ప్రభావితం అయినట్టు తెలుస్తోంది. తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో గాలి వేగం బుధవారం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకుంది. రాష్ట్రంలోని డెల్టాయిక్ ప్రాంతాలు, అలాగే కోల్‌కతాలోని పట్టణ పరిసరాల్లో ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లింది.

ఉంపన్‌ తుఫాను కారణంగా ఒడిశాలో ఎటువంటి మరణాలు సంభవించలేదు, కాని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో 12 మంది మరణించినట్లు అంచనా. 5500 ఇళ్లు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని మమతా చెప్పారు. పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి 3 నుంచి 4 రోజులు పడుతుందని చెప్పారు. కాగా బంగ్లాదేశ్ లో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.. వేలాది తాత్కాలిక గృహాలు ధ్వంసమయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories