Coronavirus: రేపు అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

Coronavirus: రేపు అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఇందులో కరోనా...

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. సోమవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని.. ఈ సమావేశానికి రావాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం కూడా వచ్చిందని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ చౌదరి దృవీకరించారు.

కాగా ఢిల్లీలో కరోనా కట్టడి చర్యలపై హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు అమిత్ షా. రెండు రోజుల్లో ఢిల్లీలో కోవిడ్‌ టెస్టులను రెట్టింపు చేస్తామని, ఆరు రోజుల్లో కరోనా టెస్టుల సామర్ధ్యం మూడింతలు చేస్తామని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories