ఎన్పీడీఆర్‌ఆర్ చైర్మన్‌గా అమిత్‌ షా

Amit Shah to Chair National Platform Disaster Risk Reduction
x
Highlights

విపత్తు నిర్వహణకు సంబంధించిన నేషనల్ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (ఎన్పీడీఆర్‌ఆర్‌) కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చైర్మన్‌గా ఉంటారు.

విపత్తు నిర్వహణకు సంబంధించిన నేషనల్ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (ఎన్పీడీఆర్‌ఆర్‌) కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చైర్మన్‌గా ఉంటారు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, సహా పలువురు మంత్రులు కూడా సభ్యులుగా ఎంపిక చేశారు. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌లు ఎన్పీడీఆర్‌ఆర్‌కు వైస్‌ చైర్మన్‌లుగా ఉంటారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను అన్నింటిని అమిత్‌ షా పర్యవేక్షించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన విపత్తు నిర్వహణ పాలసీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఎన్పీడీఆర్‌ఆర్‌ జాగ్రత్తలు తీసుకోవడం తోపాటు సలహాలు కూడా ఇస్తుంది. కాగా ప్రతి రాష్ట్రం నుంచి ఓ మంత్రి, మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాల మేయర్లు కూడా సభ్యులుగా ఉంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories