మమతా బెనర్జీ, రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్‌

మమతా బెనర్జీ, రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్‌
x
Amith Shah and Mamata File Photo
Highlights

పాకిస్థాన్ వంటి పలు దేశంలో హింసకు గురవుతున్న వారికి అండగా నిలవడం కోసం పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ) తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు

పాకిస్థాన్ వంటి పలు దేశంలో హింసకు గురవుతున్న వారికి అండగా నిలవడం కోసం పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ) తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. జబల్‌పూర్ లొ ఆదివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ)లో భారతీయులను తొలిగించే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. దేశంలో సీసీఏను అమలు చేసిన తీరుతామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా అమిత్ షా విమర్శలు సంధించారు పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం విషయంలో ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

పార్లమెంట్‌లో ఆమోదం పొంది సీసీఏ చట్టంగా రూపు దాల్చిందని దానిని దేశంలో అమలు చేస్తామని తెలిపారు. పాకిస్తానీ శరణార్ధులందరికీ మోదీ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చే వరకు విశ్రమించదని స్పష్టం చేశారు. దేశ విభజన సమయంలో పాక్ లో 30 శాతంపైగా ఉన్న హిందువులు 3 శాతానికి పడిపోయిందని అమిత్ షా తెలిపారు.

దేశ విభజన సమయంలో కాంగ్రెస్ మత ప్రాతిపదికన విభజించిందని విమర్శించారు. అణిచివేతకు గురై పాకిస్తాన్ నుంచి వచ్చే శరణార్ధులకు ఆశ్రయం కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే పాకిస్థాన్ లో నివాసం ఉండే హిందూవులు, పార్మీలు, సిక్కులు, జైన్ లు భారత్ కు తిరిగి రావాలని భావిస్తున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories