సౌర‌వ్ గంగూలీ ఇంట అమిత్ షా డిన్నర్‌...

Amit Shah Dinner at Sourav Ganguly House at Kolkata | Live News Today
x

సౌర‌వ్ గంగూలీ ఇంట అమిత్ షా డిన్నర్‌...

Highlights

Amit Shah - Sourav Ganguly: ఎలాంటి రాజకీయ అంశం లేదంటున్న గంగూలీ...

Amit Shah - Sourav Ganguly: ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్యట‌న‌కు వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... BCCI అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల ప‌ర్యట‌న నిమిత్తం కోల్‌క‌తాకు వెళ్లిన అమిత్ షా... గంగూలీ నివాసానికి వెళ్లారు. త‌న ఇంటికి వ‌చ్చిన అమిత్ షాకు గంగూలీ సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. ఆ త‌ర్వాత బీజేపీ నేత‌ల స‌మ‌క్షంలోనే ప‌లు అంశాల‌పై వీరిద్దరూ చ‌ర్చించుకున్నారు.

ఆ త‌ర్వాత గంగూలీ ఇంటిలోనే ఆయ‌న‌తో క‌లిసి అమిత్ షా విందు చేశారు. అయితే ఈ విందు భేటీలో ఎలాంటి రాజకీయ అంశం లేదని గంగూలీ స్పష్టం చేశారు. అమిత్ షా తనకు పదేళ్లకు పైగా తెలుసని, గతంలోనూ అనేకసార్లు ఆయన్ను కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. అమిత్ షా తనయుడు, BCCI కార్యదర్శి జై షా కూడా తనతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని గంగూలీ ప్రస్తావించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories