భారత్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. రష్యావైపా ? ఉక్రెయిన్‌ వైపా ? తేల్చుకో...

America Strong Warning to India about Russia Ukraine War | Live News
x

భారత్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. రష్యావైపా ? ఉక్రెయిన్‌ వైపా ? తేల్చుకో...

Highlights

India - America: రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి తాము నియమ ఆధారిత విధానంపైనే నిలబడ్డామని...

India - America: ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌పై అమెరికా, అస్ట్రేలియా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తున్నాయి. రష్యాతో చమురు ఒప్పందాలపై ఇప్పటికే అమెరికా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రనోవ్‌ పర్యటించనున్నారు. ఉక్రెయిన్ ప్రజల సౌరభౌమత్వం నిలబడుతారో? లేక రష్యావైపు నిలబడుతారో తేల్చుకోవాలని వాషింగ్టన్‌లో కామర్స్‌ సెక్రటరీ గినా రైమోండో భారత్‌కు సూచించారు.

భారత్‌ తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి తాము నియమ ఆధారిత విధానంపైనే నిలబడ్డామని.. భారత్‌ కూడా తన విధానం స్పష్టం చేయాలని రష్యా వాణిజ్య శాఖ మంత్రి డాన్‌ తెహాన్‌ అన్నారు. చైనాకు వ్యతిరేకంగా జట్టు కట్టిన ఆసియా-పసిఫిక్‌ దేశాల క్వాడ్‌ కూటమిలోని భారత్‌పై తాజా వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

రష్యా ఆయుధాలను ప్రపంచంలోనే అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారత్‌. ఇంధన ధరలు పెరగడంతో.. చమురును చౌకగా విక్రయించాలని భారత్‌ కోరింది. అందుకు రష్యా కూడా అంగీకరించింది. ఇక ఉక్రెయిన్‌ విషయంలో మొదటి నుంచి భారత్‌ తటస్థంగానే ఉంది. దౌత్యపరమైన చర్చలతో సమస్యలను పరిష‌్కరించుకోవాలని ఉక్రెయిన్‌, రష్యాకు భారత్‌ పిలపునిచ్చింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలను భారత్‌ వ్యతిరేకింది.

Show Full Article
Print Article
Next Story
More Stories