Donald Trump: అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ దంపతులు.. ఆలింగనం చేసుకున్న మోదీ

Donald Trump: అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ దంపతులు.. ఆలింగనం చేసుకున్న మోదీ
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. 11 గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. 11 గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయింది. దీంతో తొలిసారి భారత్ గడ్డపై ట్రంప్ కాలు మోపారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా విమానంలో కుటుంబంతో సహా వచ్చిన ట్రంప్ నకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ ను ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా భారతీయ సంప్రదాయా నృత్యాలతో ట్రంప్ దంపతులకు స్వాగతం లభించింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టునుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ దంపతులు వెళ్లారు.

ఈ కార్యక్రమం అనంతరం మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ట్రంప్ హాజరుకానున్నారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆయన నిన్న వాషింగ్టన్‌ డీసీ నుంచి ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో బయల్దేరిన సంగతి తెలిసిందే. వారి వెంట కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఇండియా వచ్చారు.

అధ్యక్షుడు ట్రంప్‌ ఫ్యామిలీతోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత పర్యటనకు వచ్చింది. ఇక ట్రంప్ రాకకు ముందు ప్రధాని మోదీ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.. అందులో.. 'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు యావత్‌ భారతం ఎదురుచూస్తోంది. మీ సందర్శన కచ్చితంగా ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

అహ్మదాబాద్‌లో కలుద్దాం' అని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోదీ ట్వీట్‌కు హిందీలో రిప్లై ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.. వారి రాకను తెలియజేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 'మేము భారతదేశానికి రావాలని ఎదురుచూస్తున్నాం. మేము దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!' అని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ట్రంప్‌ షెడ్యూల్‌..

01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం

03:30.. ఆగ్రాకు ప్రయాణం

సాయంత్రం

04:45.. ఆగ్రాకు చేరుకుంటారు

05:15.. తాజ్‌మహల్‌ సందర్శన

06:45.. ఢిల్లీకి ప్రయాణం

07:30.. ఢిల్లీకి చేరుకుంటారు



Show Full Article
Print Article
More On
Next Story
More Stories