భారీ స్థాయిలో తాత్కాలిక నియామకాలు చేపట్టనున్న అమెజాన్

భారీ స్థాయిలో తాత్కాలిక నియామకాలు చేపట్టనున్న అమెజాన్
x
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని దేశాలపై పడింది. దీని దెబ్బకు అన్ని రంగాలు కుదెలయ్యాయి.

కరోనా వైరస్ ప్రభావం అన్ని దేశాలపై పడింది. దీని దెబ్బకు అన్ని రంగాలు కుదెలయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ కామర్స్ సంస్థ 50 వేల మందికి ఉపాధి కల్పించనుంది.

భారత్‌లో కరోనా విజృంభిన లాక్‌డౌన్‌ కారణంగా షాపింగ్‌ మాల్స్‌, అన్ని మార్కెట్స్ మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నాలుగో దశలో కేంద్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. అయితే షాపింగ్‌ మాల్స్‌ తెరిచేందుకు మాత్రం అనుమతి లేదు. దీంతో ఆన్‌లైన్‌ షాపింగులకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 50వేల మంది తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది.

లాక్‌డౌన్‌ విధించిన మొదట్లో ఈ-కామర్స్‌ సంస్థలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, అనంతరం ఇచ్చిన సడలింపులతో ఆన్‌లైన్‌ షాపింగ్ మళ్లీ పుంజుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు అమెజాన్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో భారత్‌లో పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలతోపాటు డెలివరీ నెట్‌వర్క్‌లో తాత్కాలిక నియామకాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. తాజాగా అమెజాన్‌ భారత్‌లో ఫుడ్‌ డెలివరీ సేవలు కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ విధించిన తొలిరోజుల్లో ఈ-కామర్స్‌ సంస్థలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనంతరం ఇచ్చిన సడలింపులతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మళ్లీ పుంజుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు అమెజాన్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అఖిల్‌ సక్సేనా వెల్లడించారు. దీనిలో భాగంగానే అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలతోపాటు డెలివరీ నెట్‌వర్క్‌లో తాత్కాలిక నియామకాలను చేపడతామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో భారత్‌లో పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా అమెజాన్‌ భారత్‌లో ఫుడ్‌ డెలివరీ సేవలు కూడా ప్రారంభించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories