దేశంలో అతిపెద్ద పదవీ విరమణ పరిణామం..

దేశంలో అతిపెద్ద పదవీ విరమణ పరిణామం..
x
Highlights

దేశంలో అతిపెద్ద ఉద్యోగుల పదవీ విరమణలో, కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (విఆర్ఎస్) ను ప్రభుత్వ నిర్వహణలో ఉన్న భారత్ సంచార్ నిగం...

దేశంలో అతిపెద్ద ఉద్యోగుల పదవీ విరమణలో, కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (విఆర్ఎస్) ను ప్రభుత్వ నిర్వహణలో ఉన్న భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరియు మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) లో దాదాపు 93,000 మంది సిబ్బంది ఎంచుకున్నారు.

నష్టపోయిన సంస్థలను పునర్నిర్మించే ప్రభుత్వ పథకంలో భాగంగా వచ్చిన ఈ పదవీ విరమణను ఆఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో యుటిలిటీల వేతన బిల్లులు గణనీయంగా తగ్గడంతో పాటు భవిష్యత్తులో డబ్బు ఆర్జనకు అవకాశం ఉన్న రియల్ ఎస్టేట్ భూమ్ కు అవకాశం ఏర్పడిందంటున్నారు నిపుణులు.

విశేషమేమిటంటే, 2019 అక్టోబర్‌లో వీఆర్‌ఎస్ పథకం ఆమోదించినప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ లో పనిచేస్తున్న 1,53,000 మంది ఉద్యోగులలో సగానికి పైగా - మొత్తం 78,569 మంది ఉద్యోగులు పదవీ విరమణను ఎంచుకున్నారు. అలాగే 18,000 మందికి పైగా ఉద్యోగుల బలం ఉన్న ఎమ్‌టిఎన్‌ఎల్‌లో దాదాపు 80 శాతం మంది - 14,400 మంది ఉద్యోగులు - విఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో, 55-60 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

'సుమారు 93,000 మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఒక్క కోర్టు కేసు కూడా లేదు. బిఎస్‌ఎన్‌ఎల్ వేతన బిల్లు సుమారు 50 శాతం తగ్గుతుండగా, ఎమ్‌టిఎన్‌ఎల్ వేతన ఖర్చులు 75 శాతం తగ్గుతాయి. ఇప్పటిదాకా 1,300 కోట్ల రూపాయల ఉద్యోగుల కోసం వారి వార్షిక వ్యయం చేస్తుండగా.. ఆ వ్యయం ఇప్పుడు 650 కోట్ల రూపాయలకు తగ్గుతుంది' అని టెలికమ్యూనికేషన్ విభాగం (డిఓటి) సీనియర్ అధికారి తెలిపారు .

ఈ చర్య ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో భూమ్ అందుకుంది.. బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ కు చెందిన సంస్థలు రెండూ ఇప్పటికే డబ్బు ఆర్జించడం ప్రారంభించాయి. రెండు టెల్కోలలో పెద్దది అయిన బిఎస్ఎన్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 300 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఇరిగేషన్ విభాగానికి తిరువనంతపురం, భోపాల్ వంటి ప్రదేశాలలో విక్రయించడం ద్వారా ఈ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఎమ్‌టిఎన్‌ఎల్ తన భవన స్థలాన్ని వివిధ ప్రదేశాల్లో లీజుకు ఇవ్వడానికి ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు డిఓటి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ లోని తన భవనాన్ని లీజుకు ఇవ్వడం ప్రారంభించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories