అల్‌ఖైదా చీఫ్ జవహరీ హతం

Al-Qaeda Chief Al-Zawahiri Killed In Afghanistan By US
x

అల్‌ఖైదా చీఫ్ జవహరీ హతం 

Highlights

*డ్రోన్ దాడితో మట్టుబెట్టిన అమెరికా, కాబూల్‌లో సీఐఏ డ్రోన్ దాడి

Al-Zawahiri: కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన అమెరికా తాజాగా మరోమారు కోలుకోలేని దెబ్బకొట్టింది. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీని హతమార్చింది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జరిపిన డ్రోన్ దాడిలో జవహరీ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం జరిపిన డ్రోన్ దాడిలో జవహరీ హతమైనట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.

అమెరికా డ్రోన్ దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందించారు. డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారిస్తూనే తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహరీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గా పేర్కొన్నారు.

11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు. ఈ దాడి సూత్రధారుల్లో అల్ జవహరీ కూడా ఒకరని అమెరికా గుర్తించింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలను జవహరీ తీసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories