మహారాష్ట్ర రాజకీయాల్లో మహా మలుపు

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా మలుపు
x
అజిత్ పవార్
Highlights

మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఊహించని మలుపు తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు.

మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఊహించని మలుపు తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రంలోగా బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. అయితే బలపరీక్షకు ముందుగానే ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి.అయితే శరద్ పవర్ సతీమణి అజిత్ పవార్ తో సంభాషించారని, అందుకే ఆయన ఉపముఖ‌్యమంత్రి పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరగుతోంది. ఈలోగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతారని సమాచారం. మూడు రోజుల క్రితం ఎన్సీపీ నేత అజిత్ బీజేపీకి మద్దతు తెలిపారు. రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగాను, అజిత్ పవార్ ఉపముఖ‌్యమంత్రిగాను ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ పై ఎన్సీపీ అధిష్టానం వేటు వేసింది.

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఊహించని పరిణామాలు జరిగాయి. బీజేపీ

సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బలనిరుపణ కోసం గవర్నర్ వీరికి గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ విచారించిన కోర్టు బుధవారంలోగా ఫడ్నవీస్ సర్కార్ బలం నిరుపించుకోవాలని, అది రహాస్య ఓటింగ్ కాకుండా ప్రత్యక్షప్రసారం ద్వారా నిరుపించుకోవాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories