Aurangzeb tomb row: హిందువులకు షాక్‌.. ముస్లింలకు ప్రభుత్వం సపోర్ట్? వారిపై కఠిన చర్యలు!

Aurangzeb tomb row: హిందువులకు షాక్‌.. ముస్లింలకు ప్రభుత్వం సపోర్ట్? వారిపై కఠిన చర్యలు!
x
Highlights

మహారాష్ట్రలో మత రాజకీయాలు మళ్లీ ముదురుతున్న వేళ.. అజిత్ పవార్ ముస్లింలకు మద్దతుగా కామెంట్స్ చేశారు.

ఔరంగజేబ్ సమాధి వివాదం-నాగ్‌పూర్ హింసాకాండతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ముస్లిం సమాజానికి అండగా నిలవడం రాజకీయంగా కీలకంగా మారింది. ముంబైలో జరిగిన ఎన్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అజిత్ పవార్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సమాజాన్ని మతపరంగా చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకోబోమని తేల్చిచెప్పారు.

ప్రస్తుతం మహాయుతి భాగస్వామిగా ఉన్నా, ఎన్సీపీ తన భావజాలన్ని వదలదని అజిత్ స్పష్టం చేశారు . జాతి, మత, భాష, ప్రాంతం అనే తేడాలు ఉండే దేశం మనదని.. అందరూ కలిసి జీవించాలని చెప్పారు. ముస్లింలను బెదిరించే వాళ్లను వదిలిపెట్టమని అజిత్ చేసిన కామెంట్స్‌పై రచ్చ మొదలైంది. అజిత్ వ్యాఖ్యలపై కూటమిలో ఉన్న బీజేపీ నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే అజిత్‌ పవార్‌పై సెటైర్లు వేశారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడు.. దేశానికి నమ్మకంగా ఉండే ముస్లింలను ఎవరూ ఏమీ అనవద్దని.. కానీ దేశద్రోహ చర్యలతో ఉన్నవారిని మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దీంతో అధికార కూటమి పార్టీల మధ్య విధాన రేఖలు స్పష్టంగా బయటపడుతున్నాయి. అజిత్ పవార్ గతంలో కూడా ఓట్లు కోల్పోయినా కూడా తన పార్టీ లౌకికతను పాటించే ప్రగతిశీల పార్టీగానే ఉండనుందని చెప్పిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నా, తమ సిద్ధాంతాలను తాకట్టు పెట్టబోమని తెలిపారు.

ఈ వివాదం ఎలా మొదలైంది?

ఔరంగజేబ్ సమాధిని కేంద్రంగా చేసుకొని మహారాష్ట్రలో ఘర్షణలు చెలరేగాయి. నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత కొన్ని హిందుత్వ వర్గాలు ముస్లింలపై తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు, ప్రదర్శనలు మతాంతర విద్వేషాలను రెచ్చగొట్టాయి. ఈ పరిస్థితుల్లో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నంగా చూడవచ్చు. కానీ రాజకీయపరంగా మాత్రం ఇవి మరింత చర్చకు తావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories