Top
logo

భవిష్యత్‌లోనూ సామరస్యంగా వ్యవహరించాలి : అజిత్ దోవల్

Ajit dovalAjit doval
Highlights

అయోధ్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హిందూ, ముస్లిం మత పెద్దలతో ఢిల్లీలో జాతీయ భద్రతా...

అయోధ్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హిందూ, ముస్లిం మత పెద్దలతో ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమామేశమయ్యారు. ఈ కేసు తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘనలు జరకుండా రెండు వర్గాలు సంయమనం పాటించాయని దోవల్ ప్రశంసించారు. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించడంతోపాటుగా భవిష్యత్‌లోనూ సామరస్యంగా వ్యవహరించాలన్నా. ఈ సమావేశానికి యోగా గురు బాబా రాందేవ్‌, స్వామి చిదానంద్ సరస్వతి, స్వామి పరమాత్మానంద్, షియా క్లరిక్‌ మౌలానా కల్బేజవాద్‌ అవదేశానంద మహరాజ్‌తోపాటు పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు.

భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీకోర్టు శనివారం కీలక తీర్పు వెల్లడించింది. 40 రోజుల పాటు వరుసగా విచారణ చేసిన రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని విషయం తెలిసిందే.

Next Story