Mangaluru ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. అనుమానితుడి అరెస్ట్

Mangaluru ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. అనుమానితుడి అరెస్ట్
x
Highlights

కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో ఎయిర్ పోర్టు ఆవరణలో బాంబు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో ఎయిర్ పోర్టు ఆవరణలో బాంబు కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనవరి 20న సోమవారం బాంబు కలిగిన బ్యాగును కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది కనుగొన్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు 360 కిలోమిటర్ల దూరంలో ఉన్న మంగళూరులో విమానాశ్రయంలో బాంబు బాంబును కనుగొన్న ఘటనలో అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను బెంగళూరులోని డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్‌లో లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన సంఘటనలో అనుమానితుడు ఆదిత్యరావు ఇక్కడి డీజీపీ కార్యాలయంలో లొంగిపోయాడు. అతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడు ఆదిత్యరావును విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు అనంతరం, అనుమానితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవానికి వారంరోజులు ఉన్న నేపథ్యంలో పట్టణంలో జరిగిన సంఘటన కలకలం సృష్టించింది. అలాగే గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories