ఢిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ఇవాళ్టి నుంచి బీఎస్‌-III పెట్రోల్‌.. బీఎస్‌-IV డీజిల్‌ వాహనాలపై తాత్కాలిక నిషేధం

Air Pollution in Delhi
x

ఢిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ఇవాళ్టి నుంచి బీఎస్‌-III పెట్రోల్‌.. బీఎస్‌-IV డీజిల్‌ వాహనాలపై తాత్కాలిక నిషేధం

Highlights

Delhi: కాలుష్య కారక వాహనాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

Delhi: ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయిలో మారింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు గత రెండు రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతున్నది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది. ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్సీఆర్‌ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులతో పాటు పొగమంచు కారణంగా గాలి నాణ్యత తగ్గుతోందని అధికారులు చెబతుున్నారు. వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories