Delhi Pollution: ఢిల్లీలో మరింత తీవ్రంగా వాయు కాలుష్యం.. పలు ప్రాంతాల్లో కమ్మేసిన పొగమంచు

Air Pollution Gets Serious Day By Day in Delhi
x

Delhi Pollution: ఢిల్లీలో మరింత తీవ్రంగా వాయు కాలుష్యం.. పలు ప్రాంతాల్లో కమ్మేసిన పొగమంచు 

Highlights

Delhi Pollution: ఆనంద్‌ విహార్‌లో 453, నరేలాలో 482, పంజాబీ బాగ్‌లో 481, ఆర్‌కేపురంలో 430 AQI నమోదు అయినట్లు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. దీపావళి తర్వాత వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. నగరంలో ఎక్కడా చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోతుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం ఉదయం తీవ్రమైన కేటగిరిలోనే నమోదు అయింది. ఆనంద్‌ విహార్‌లో 453, నరేలాలో 482, పంజాబీ బాగ్‌లో 481, ఆర్‌కేపురంలో 430 AQI నమోదు అయినట్లు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణించడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉత్తర దిశ నుంచి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి వేగం తగ్గడంతో కాలుష్యం పెరిగింది. గురువారం, శుక్రవారం తూర్పు దిశ నుంచి గాలులు వచ్చే అవకాశం ఉందని ఐ.ఐ.టీ.ఎం అంచనా వేసింది. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories