Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆ ముగ్గిరిని తొలగించమని చెప్పిన డీజీసీఎ

Air India
x

Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆ ముగ్గిరిని తొలగించమని చెప్పిన డీజీసీఎ

Highlights

Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని డీజీసీఎ సీరియస్‌గా తీసుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని డీజీసీఎ సీరియస్‌గా తీసుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు విమాన ప్రమాదం జరిగే సమయానికి సరిగా విధులు నిర్వహించలేదని, దీనిపై ఆగ్రహించిన డీజీసీఎ వాళ్లను విధుల నుండి తొలగించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్నే కుదిపేసింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఒక మెడికో హాస్టల్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 272 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఎ) చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎక్కడక్కడ విచారణ జరుపుతూ కఠిన చర్యలు తీసుకుంటుంది. విమానం కూలడానికి కారణాలు, ఎయిర్ ఇండియా ఉద్యోగుల విధివిధానాల వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎయిర్ ఇండియా షెడ్యూల్, రోస్టర్‌‌కు సంబంధించిన డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్నారు. వారు సరిగా విధులు నిర్వహించకుండా, ఎయిర్ లైన్స్ నిబంధనలు సరిగా పాటించకుండా ఉన్నందుకే వీరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సర్వీసింగ్ , లైసెన్సింగ్‌ లోపాలు ఉన్నా ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై కూడా డీజీసీఎ మండి పడింది. రూల్స్ సరిగా పాటించకుండానే విమాన సిబ్బందిని షెడ్యూల్ చేసారని అందుకే ముగ్గురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేయాలని సూచించింది. ఈ ముగ్గురు అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలు పది రోజుల్లో సమర్పించాలని కూడా డీజీసీఎ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories