Somanath: ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్‌కు ఘన స్వాగతం.. చప్పట్లతో అభినందించిన ప్రయాణికులు

Air Hostess Welcomes Isro Chief S Somanath With Heartfelt In Flight Announcement
x

Somanath: ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్‌కు ఘన స్వాగతం.. చప్పట్లతో అభినందించిన ప్రయాణికులు

Highlights

Somanath: ఇండిగో విమానంలో నేషనల్‌ హీరో

Somanath: చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత దేశం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అదే స్థాయిలో ఇస్రో సైంటిస్టుల పేరు దేశ విదేశాల్లో మారు మోగుతోంది. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు విమాన క్యాబిన్‌ క్రూ స్వాగతించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండిగో క్యాబిన్ క్రూ సభ్యురాలు విమానం PA సిస్టమ్ ద్వారా ప్రయాణీకుల కోసం చేసే ప్రకటనలో ఇస్రో చీఫ్‌ని స్వాగతించారు. విమానంలో "నేషనల్ హీరో" ఉన్నారని గర్వంగా ప్రకటించింది.. సార్ భారతదేశం గర్వపడేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు." అని ప్రకటించడంతో విమానంలోని ప్రయాణీకులందరూ కరతాళ ధ్వనులతో సోమనాథ్‌కు స్వాగతం చెప్పారు.

పూజా షా అనే ఎయిర్ హోస్టెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో కంటే ఎయిర్‌ హోస్టెస్‌ కామెంట్స్‌ ఇంకా ఆసక్తికరంగా మారాయి. మా INDIGO విమానంలో సోమనాథ్‌కు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావించాను. మా విమానంలో జాతీయ హీరోలు ఉండటం ఆనందంగా ఉంది.. అనే టైటిల్‌తో వీడియోను షేర్ చేశారు. వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories