Covid19 Vaccine: వ్యాక్సిన్‌ ఆరు వారాల్లో వస్తుందని చెప్పలేం : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

Covid19 Vaccine: వ్యాక్సిన్‌ ఆరు వారాల్లో వస్తుందని చెప్పలేం : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా
x
Highlights

Covid19 Vaccine: భారత్ బయోటెక్ కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్‌పై ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

Covid19 Vaccine: భారత్ బయోటెక్ కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్‌పై ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ బయోటెక్ కరోనా టీకాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ రూపొందించిన కోవ్యాక్సిన్‌కు డీసీజీఐ అంటే డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతినిచ్చింది. భారత్ బయోటెక్ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వైరస్ నివారణ మందును రూపొందించనుంది. ఆగస్టు 15లోగా టీకాను మార్కెట్ లోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐసీఎంఆర్‌ ప్రకటించినట్లు ఆరు వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం కష్టమని రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా అభిప్రాయపడ్డారు.

మనుషులపై ప్రయోగాలు నిర్వహించి అది సురక్షితమైందా? కాదా? అని నిర్ధారించుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో చాలా దశలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన టీకా తొలుత మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. భారత్‌లో చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో తలమునకలయ్యాయనీ, అందులో భారత్‌ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌, క్యాడిలా లాంటి సంస్థలు కూడా ఉన్నాయన్నారు.

కరోనా నివారణకు టీకా అభివృద్ధిలో చాలా దశలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ను తొలుత మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుందా? లేదా? అన్నది చూడాలి. దీనికి కొన్ని వారాలు పడుతుందని రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.వ్యాక్సిన్‌ భద్రత గురించి ఆలోచించాల్సి ఉంటుంది. లక్షలాది మందికి దాన్ని ఇస్తారు కాబట్టి భద్రత అతి ముఖ్యం. అది సురక్షితంగా ఉందని, 70-80% మేర నిలకడైన రోగ నిరోధక శక్తిని ఇస్తుందని, ఎవరికి ఇచ్చినా దానివల్ల ప్రతికూల ప్రభావాలు కనిపించవని తేలాకే అడుగు ముందుకు వేయగలం అని అన్నారు. మొత్తం 6 వారాల్లో పూర్తి కావడానికి అవకాశాలు తక్కువ. కరోనా పూర్తిగా నశించి పోదు.. కాకపోతే మరో మూడు నెలల్లో కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. అందరికీ టీకా అందించిన తర్వాతే వైరస్‌ తగ్గిపోతుంది. అప్పుడే మనం పూర్వపు సాధారణ పరిస్థితులకు రాగలం అని రణ్‌దీప్‌సింగ్‌ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories