ఇవాళ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు

AICC President Election Results Today
x

ఇవాళ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు

Highlights

*ఉ.10 గంటల నుంచి కౌంటింగ్‌.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు

AICC President Election: ఇవాళ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక.. మొత్తం ఓటు వేసిన పీసీసీ డెలిగేట్లు 9వేల 937 మంది ఉండగా.. 9వేల 477 మంది పీసీసీ డెలిగేట్లు ఓటు వేశారు. దీంతో 96 శాతం పోలింగ్‌ నమోదైంది.

38 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మొత్తం 68 బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. అన్ని బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను కలిపిన తర్వాత.. బ్యాలట్ పేపర్లను చిన్న చిన్న కట్టలుగా కట్టి.. కౌంటింగ్‌ ప్రారంభించనున్నారు. ఒక్కో కట్టలో 25 బ్యాలట్‌ పేపర్లను కట్టనున్నారు. సగానికిపైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లుగా ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories