AI drones: ఏఐ డ్రోన్లకు భారీగా పెరుగుతోన్న డిమాండ్

Ai Drones
x

Ai Drones: ఏఐ డ్రోన్లకు భారీగా పెరుగుతోన్న డిమాండ్

Highlights

Ai Drones: దేశంలో డ్రోన్ల విప్లవం మొదలైంది. పంజాబ్‌లో పంటలకు మందులను స్ర్పే చేసే దగ్గర నుంచి అస్సాంలో వరద ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం వరకు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Ai Drones: దేశంలో డ్రోన్ల విప్లవం మొదలైంది. పంజాబ్‌లో పంటలకు మందులను స్ర్పే చేసే దగ్గర నుంచి అస్సాంలో వరద ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం వరకు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి భారీ స్థాయిలో కాంట్రాక్టులు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ దక్కించుకుంది. వివరాలు చూద్దాం..

ఏఐ డ్రోన్లు ఇప్పుడు జీవనశైలిలో భాగమైపోతున్నాయి. వ్యవసాయం, విపత్తలు, పరిశ్రమలు.. ఇలా అన్నింటిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు కూడా డ్రోన్ల సాయాన్ని కోరుతున్నాయి. తాజాగా గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి భారీ స్థాయిలో వచ్చిన కాంట్రాక్టులే ఇందుకు నిదర్శనం.

ఏఐ ఆధారిత డ్రోన్ల సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రల ప్రభుత్వం నుంచి పలు ప్రాజెక్టులు అందుకున్నట్లు ఇటీవల డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరో స్పేస్ వెల్లడించింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్‌తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్‌లు కలెక్ట్ చేయడం , సర్వే మ్యాప్‌లు వంటి వాటిని ఈ డ్రోన్లు చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తమళనాడుకు చెందిన జియాలజీ, మైనింగ్ డిపార్ట్ మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్ల కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. మరోపక్క ఝార్ఖండ్ లోని ఎక్స్ ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories