నితీష్ కుమార్ పార్టీలో చేరనున్న తేజ్ ప్రతాప్ మామ..!

నితీష్ కుమార్ పార్టీలో చేరనున్న తేజ్ ప్రతాప్ మామ..!
x
Highlights

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల్లో చిక్కుకొన్న సంగతి తెలిసిందే.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల్లో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమారులిద్దరు పార్టీని నడిపిస్తున్నారు. అయితే వీరి వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆర్జెడీకి దూరంగా ఉంటున్నారు కొందరు నేతలు. వారిలో ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ కూడా ఒకరు. ఆయన ఎమ్మెల్యే మాత్రం కాదు. తేజ్ ప్రతాప్ యాదవ్ కు స్వయానా పిల్లనిచ్చిన మామ. తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్య ఆయన కూతురే. పార్టీలో అల్లుడి వ్యవహార శైలి కారణంగా ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో చేతులు కలపాలి అనుకుంటున్నారట.

త్వరలో చంద్రిక రాయ్ జేడీయూలో చేరే అవకాశాలు ఉన్నట్టు బీహార్ లో చర్చ సాగుతోంది. ఆత్మగౌరవం ఉన్నవారికి చోటు లేదని.. లాలూ పార్టీని కుటుంబ పార్టీగా మార్చారని ఆరోపించారు చంద్రిక రాయ్. నితీష్ కుమార్ మంత్రివర్గంలో మాజీ మంత్రి అయిన చంద్రిక గురువారం తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించడానికి నిరాకరించినప్పటికీ, బీహార్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. బీహార్ అభివృద్ధికి దూరదృష్టి గల నాయకుడిగా నితీష్ ను అభివర్ణించారు.

వాస్తవానికి చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య మే 12, 2018 న తేజ్ ప్రతాప్ ను వివాహం చేసుకున్నారు, కాని అతను ఐదు నెలల తరువాత విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు తేజ్ ప్రతాప్. అప్పటి నుండి ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తేజ్ ప్రతాప్ తన భార్యపై చాలా ఆరోపణలు చేశాడు. వివాహం సందర్భంగా ఐశ్వర్య తన పుట్టింటి నుంచి తెచ్చిన వస్తువులను లాలూ భార్య రబ్రీ దేవి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు, కాని ఐశ్వర్య తండ్రి చంద్రిక రాయ్ మాత్రం వాటిని తీసుకోకుండా అల్లుడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రిగానే కాకుండా, చంద్రిక బలమైన రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన వారు.. ఆయన దివంగత ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ కుమారుడు. ఆయన పార్టీ మార్పుపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయక పోయినప్పటికీ ఎన్నికల నాటికి జేడీయూ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు బీహార్ లో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories