India: కోవిడ్ కంటైన్‌మెంట్, నిర్వహణపై మరోసారి కేంద్రం మార్గదర్శకాలు

Again Centar Guidelines on Covid Containment
x

కరోనా కంటైన్మెంట్ జోన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

India: గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలకు కేంద్రం న్యూ గైడ్‌లైన్స్‌

India: దేశంలో కరోనా విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక.. గ్రామాల్లో కరోనా నియంత్రణపై దృష్టి సారించింది కేంద్ర ఆరోగ్యశాఖ. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా కొత్త గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది.

భారత్‌లో కరోనా కేసులు మునుపటితో పోలిస్తే.. కాస్త తగ్గాయి. ఇక.. ఇదే మంచి సమయమని భావించిన కేంద్రం.. కోవిడ్ కంటైన్‌మెంట్, నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. సెమీ-అర్బన్, గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్‌ చేసింది. గ్రామాల్లో హెల్త్ కమ్యూనిటీలు, ప్రైమరీ లెవెల్ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది. అలాగే.. గ్రామాల్లో అత్యవసర ఆరోగ్య సేవలను కంటిన్యూ చేస్తూ... కరోనా విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యేలా రాష్ట్రాలు రెడీ అవ్వాలని కోరింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్రం కోరింది. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలని సూచించింది. దాదాపు 85 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయన్న కేంద్రం.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందాలని తెలిపింది. ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని, కోవిడ్ బాధితులందరికీ హోమ్‌ ఐసోలేషన్ కిట్లు అందించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

ప్రతి గ్రామంలో యాక్టివ్‌ సర్వేలెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం. ఈ వ్యవస్థ ద్వారా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా.. అనారోగ్యంతో ఉన్నారా అనేది పరిశీలించాలని కోరింది. ఈ పనిని ఆశావర్కర్లు, గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య, పోషక కమిటీ సహకారంతో చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని, కరోనా బాధితులకు ఒకవేళ ఆక్సిజన్ సమస్య ఉంటే.. వారిని ఉత్తమమైన కేంద్రాలకు తరలించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

కరోనా సోకి, లక్షణాలు లేనివారిని క్వారంటైన్‌లో ఉంచాలని, ICMR ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. తన మార్గదర్శకాల్లో తెలిపింది. గ్రామాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్‌ జరపాలని తెలిపింది. థెర్మోమీటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు వంటి వాటిని గ్రామాల్లో ఉన్నవారికి లోన్ రూపంలో ఇవ్వాలని. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వాలంటీర్లు, టీచర్లు వంటి వారు.. కరోనా సోకకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories