Top
logo

Jaya Bachchan: బచ్చన్ ఇంటికి భద్రత కట్టుదిట్టం

Jaya Bachchan: బచ్చన్ ఇంటికి భద్రత కట్టుదిట్టం
X

Jaya Bachchan's Parliament Speech

Highlights

Jaya Bachchan: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌తోపాటు రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. నెపోటిజం, డ్రగ్స్ వల్లనే సుశాంత్ చనిపోయాడంటూ పలువురిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Jaya Bachchan: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌తోపాటు రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. నెపోటిజం, డ్రగ్స్ వల్లనే సుశాంత్ చనిపోయాడంటూ పలువురిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్లమెంట్‌లోనూ బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగంపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం ఎక్కువైందని, అగ్రనటులు కూడా వాటికి బానిసయ్యారని, చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్ర‌స్తుతం జయబచ్చన్ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో పలువిధాలుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు ముందు జాగ్రత్తగా.. బచ్చన్ ఇంటి సెక్యూరిటీని మరింత పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ముంబై జల్సాలోని బచ్చన్స్ బంగ్లా లోపల, బయట అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలోనే జ‌య‌బ‌చ్చ‌న్ ను ఉద్దేశిస్తూ.. బాలీవుడ్ న‌టి కంగ‌నా మాట‌ల యుద్ధానికి దిగింది. జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉంటే ఇలాగే మాట్లాడతారా.. ఇండస్ట్రీలో వేధిస్తున్నారని అభిషేక్ బచ్చన్ చెబితే ఇలాగే మాట్లాడేవారా? అంటూ కంగనా ట్వీట్ చేసింది.

Web TitleAfter Jaya Bachchan's Parliament Speech, Security Outside Bachchans' Home
Next Story