ప్రియుడితో జీవించేందుకు భార్యకు రాతపూర్వక అనుమతి ఇచ్చిన భర్త

ప్రియుడితో జీవించేందుకు భార్యకు రాతపూర్వక అనుమతి ఇచ్చిన భర్త
x

ప్రియుడితో జీవించేందుకు భార్యకు రాతపూర్వక అనుమతి ఇచ్చిన భర్త

Highlights

భార్యను ప్రేమించినప్పటికీ ఆమె ప్రవర్తనపై విసిగి, చివరికి ఆమెకు స్వేచ్ఛ ఇచ్చిన భర్త ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన రామ్‌చరణ్‌ (47) తన భార్య జానకీదేవి (40) ప్రియుడితో జీవించేందుకు రాతపూర్వకంగా అనుమతి ఇచ్చాడు.

రామ్‌చరణ్‌ ముంబయిలో టైల్స్‌ కార్మికుడిగా పని చేస్తుండగా, జానకీ గ్రామంలోనే ఉండి పిల్లలను చూసుకుంటూ వస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, నాలుగేళ్ల క్రితం జానకీ సమీప గ్రామానికి చెందిన దినసరి కూలీ సోను ప్రజాపతి (24)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి ఏడాది పాటు ఆమె సోనుతో కలిసి ఒకే ఇంట్లో నివసించింది.

ఈ విషయం తెలిసిన రామ్‌చరణ్‌ మొదట తన భార్యను నిలదీయగా, ఆమె క్షమాపణ చెప్పి తిరిగి భర్తతో కలిసి జీవించేందుకు అంగీకరించింది. కానీ కొంతకాలం తర్వాత మళ్లీ జానకీ తన ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. దీంతో జూలై 20న భవానీగంజ్‌ పోలీస్ స్టేషన్‌లో తన భార్య గల్లంతయిందని రామ్‌చరణ్‌ ఫిర్యాదు చేశాడు.

అయితే, కొద్ది రోజుల తర్వాత ఆయన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. జానకీ తన ప్రియుడు సోనుతో ఉండాలనుకుంటోందని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా పోలీసులకు స్పష్టంగా తెలిపారు. “గతంలో ఆమె తిరిగి వచ్చినప్పుడు క్షమించాను. కానీ ఇప్పుడు భయంగా ఉంది. ఆమెతో ఇక కలిసి జీవించలేను” అని రామ్‌చరణ్‌ చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories