Top
logo

Adulteration liquor deaths punjab : పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం

Adulteration liquor deaths punjab : పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Adulteration liquor deaths punjab : పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం భారీగా జనాలు మృత్యువాతపడుతున్నారు.

Adulteration liquor deaths punjab : పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం భారీగా జనాలు మృత్యువాతపడుతున్నారు. పంజాబ్ లోని తరన్ తారన్, అమృత్‌సర్, బటాలాల జిల్లాల్లో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ లోని ఆ మూడు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 86 మంది మృత్యువాత పడ్డారు. కాగా అత్యధికంగా తరన్ తారన్‌లోనే 63 మంది మృతి చెందారు. ఈ ఘటనను పంజాబ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జలంధర్‌ డివిజన్‌ కమీషనర్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. అక్రమ మద్యం తయారీపై దాడులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి సస్పెండ్ చేసారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు వరుస మరణాల నేపద్యంలో 100కి పైగా నకిలీ మద్యం తయారీ స్థావరాలపై పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.


Web TitleAdulteration liquor deaths punjab : Adulteration liquor deaths rises to 86 in punjab
Next Story