ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న రజినీకాంత్

ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న రజినీకాంత్
x
Rajinikanth (file photo)
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే తాను కేవలం పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని అన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే తాను కేవలం పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లను పార్టీలోకి ఆహ్వానించినట్టు రజిని తెలిపారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్న రజిని.. పార్టీలో 65 శాతం సీట్లను వారికే ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్లలతో రజినీకాంత్ భేటీ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తనను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారని.. 1996 కి ముందు రాజకీయాల గురించి ఎవరు ఆలోచించలేదని అన్నారు.

పదవులకోసం పనిచేసే వారు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. వ్యవస్థను మార్చకుండా మార్పు రాదన్న రజిని.. వ్యవస్థలను మార్చుతామన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని.. సీఎం అవ్వాలన్న కోరిక లేదని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల కిందటే చెప్పానన్న రజిని.. ఇక వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజకీయాలను అన్ని పార్టీలు వ్యాపారంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లను విభజించడానికి నేను రాజకీయాల్లోకి రావడం లేదు - విప్లవం చెలరేగాలని అన్నారు. ఇక తమిళనాడులో భారీ శూన్యత ఉందన్న రజిని.. 54 సంవత్సరాల నాటి ద్రావిడ పాలనను తొలగించే సమయం ఆసన్నమైందని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories