West Bengal: కాంగ్రెస్‌కు భారీ షాక్.. TMC లో చేరిన..

Abhijeet Mukherjee Joins in Trinamool Congress
x

అభిజీత్ ముఖర్జీ 

Highlights

West Bengal: పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

West Bengal: పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో టీఎంసీ నేతలు పార్ధా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి అభిజిత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ.అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories