Delhi Mayor Election: ఢిల్లీ మేయర్‌ ఎన్నిక.. సుప్రీంకోర్టులో ఆప్‌‌కు విజయం

AAP Win in Supreme Court
x

Delhi Mayor Election: ఢిల్లీ మేయర్‌ ఎన్నిక.. సుప్రీంకోర్టులో ఆప్‌‌కు విజయం

Highlights

Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఆదేశం

Delhi Mayor Election: ఎన్నికల్లో గెలిచినా.. మేయర్‌ ఎన్నికకు ఆటంకాలు ఎదుర్కొంటున్న తరుణంలో... ఆమ్‌ఆద్మీ పార్టీకి విజయం దక్కింది. నామినేటెడ్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు తేల్చి చెప్పింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్‌ కోసం జరిగే ఓటింగ్‌కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని ఆప్‌ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1957 ప్రకారం.. నామినేటెడ్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది. ఈ తరుణంలో మూడుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదా పడగా.. ఆప్‌ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్‌ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. దీంతో ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై ప్రతిష్టంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో, ఫిబ్రవరి 6వ తేదీల్లో సభ్యుల ఆందోళనలతో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో మూడుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories