మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
x
Highlights

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆప్(ఆమ్ ఆద్మీ) అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు.

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆప్(ఆమ్ ఆద్మీ) అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అలాగే కేజ్రీవాల్ తరువాత కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ కొత్త మంత్రివర్గంలో ఎటువంటి మార్పు ఉండదని.. కొత్త ప్రభుత్వంలో పాత మంత్రులే కొనసాగుతారని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులు - మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ పదవి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందు, కేజ్రీవాల్ తన మంత్రులకు విందు ఇచ్చారు. ఈ సందర్బంగా మరోసారి ఢిల్లీలో సుపరిపాలన అందించాలని మంత్రులకు సూచించారు. ఇదివరకు సుపరిపాలన అందించడం వలెనే మళ్ళీ అతిపెద్ద విజయం సాధించామని మంత్రులకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

అయితే, తాజాగా ఏ మంత్రిత్వ ఏ శాఖ కేటాయించారు అనేది ఇంకా స్పష్టం కాలేదు. కాగా ఆప్ క్యాబినెట్ మంత్రులందరూ విజయం సాధించారు. ప్రమాణస్వీకారం సందర్బంగా ముందుగా ఉదయం 11:50 గంటలకు, కేజ్రీవాల్ రామ్ లీల మైదానానికి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది క్షణాలు ముందు, జాతీయగీతం ఆలపించారు. కేజ్రీవాల్ చిత్రంతో పాటు 'ధన్యావద్ దిల్లీ' వంటి సందేశాలను కలిగి ఉన్న పెద్ద బ్యానర్లు రామ్‌లీలా మైదానంలో ఉంచారు.

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి వేలాది మంది మద్దతుదారులు వచ్చారు. ఈ సందర్బంగా కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. అభిమానులు రామ్ లీల మైదాన్ వద్ద ఉన్న థీమ్ లౌడ్ స్పీకర్లపై దేశభక్తి గీతాలతో హోరెత్తించారు. 'బోర్డర్', 'రంగ్ దే బసంతి' చిత్రాల పాటలు ప్లే చేశారు. 2011 లో, సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి నిరోధక ఉద్యమానికి నాయకత్వం వహించారు. గత ఐదు సంవత్సరాలలో నగర అభివృద్ధికి సహకరించిన వివిధ రంగాలకు చెందిన 50 మంది వ్యక్తులు కూడా కేజ్రీవాల్‌తో వేదికను పంచుకున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories