Election Commission: ఆధార్, ఓటరు, రేషన్ కార్డులను SIRలో పరిగణించలేం.. ఎన్నికల కమిషన్

Election Commission
x

Election Commission: ఆధార్, ఓటరు, రేషన్ కార్డులను SIRలో పరిగణించలేం.. ఎన్నికల కమిషన్

Highlights

Election Commission: భారత ఎన్నికల సంఘం (ECI) బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను సమర్థించింది. ఆధార్, ఓటరు గుర్తింపు లేదా రేషన్ కార్డులను ఓటరు అర్హతకు రుజువుగా అంగీకరించలేమని అదేవిధంగా పౌరసత్వ రుజువును తెలియజేసే రాజ్యాంగ అధికారాన్ని కూడా అంగీకరించలేమని తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఆధార్, రేషన్ కార్డులు మరియు ఇప్పటికే ఉన్న ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డులు (EPIC) ఓటరు అర్హతను నిర్ధారించడానికి స్వతంత్ర పత్రాలుగా ఎందుకు చేర్చబడలేదో పోల్ బాడీ తన అఫిడవిట్‌లో వివరణాత్మక వివరణ ఇచ్చింది. జూలై 10న, SIR కు సంబంధించిన చెల్లుబాటును పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అదేవిధంగా తదుపరి ఆదేశాల వరకు ముసాయిదా జాబితాను ఖరారు చేయరాదని కూడా కోర్టు తెలిపింది. ఆధార్ కార్డులు, ఓటరు IDలు మరియు రేషన్ కార్డులను ఓటర్ల జాబితాలలో చేర్చడానికి ఆమోదయోగ్యమైన అర్హత రుజువుగా పరిగణించాలని కోర్టు ECIని కోరింది.

సోమవారం సాయంత్రం సమర్పించిన వివరణాత్మక అఫిడవిట్‌లో, ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించడానికి అలాగే ఆదేశాలు ఇవ్వడానికి పూర్తి అధికారాన్ని కల్పిస్తుందని కోర్టులో వాదించింది. అయితే ప్రస్తుతం ఆమోదించబడుతున్న 11 పత్రాల జాబితా సమగ్రమైనదని కోర్టు వెల్లడించింది.

ఓటరు నమోదు కోసం పౌరసత్వాన్ని నిరూపించడంలో వైఫల్యం ఒకరి పౌరసత్వాన్ని రద్దు చేయడమే కాదని కమిషన్ స్పష్టం చేసింది. "ఆర్టికల్ 326 కింద అర్హత లేకపోవడం పౌరసత్వాన్ని రద్దు చేయడానికి దారితీయదు" అని పేర్కొంది, అయితే SIR అనేది ఓటర్ల జాబితా అనేది ఓటర్ల గణాంకాలను తెలియజేసేది అది వెల్లడించింది.

బీహార్ విషయానికొస్తే.. జూలై 18 నాటికి, బీహార్‌లోని మొత్తం 7.11 కోట్ల మంది ఓటర్ల నుండి వివరాలను సేకరించామని కమిషన్ నివేదించింది. మరణించిన, శాశ్వతంగా మారిన ఓటర్లను అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసిన ఓటర్లను వేరే ఫారమ్ సేకరణలో తీసుకున్నామని చెప్పింది. మొత్తంగా 94.68% ఓటర్లను సమర్థవంతంగా కవర్ చేసేనట్లు కమిషన్ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories