Parliament: పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్

A Total Of 15 Mps Suspended From The Parliament Today
x

Parliament: పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్

Highlights

Parliament: అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీల డిమాండ్

Parliament: పార్లమెంట్‌లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు.

కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్‌ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. పార్లమెంట్‌లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్‌లో భద్రతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories