Amarnath Yatra: నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర.. చిక్కుకుపోయిన 7 వేల మందికిపైగా యాత్రికులు

A stalled Amarnath Yatra
x

Amarnath Yatra: నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర.. చిక్కుకుపోయిన 7 వేల మందికిపైగా యాత్రికులు

Highlights

Amarnath Yatra: జమ్మూలో భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన యాత్ర

Amarnath Yatra: జమ్మూలో భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకం ఏర్పడింది. జమ్మూ-కశ్మీర్‌లోని రాంబన్‌లో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి దెబ్బతినడంతో యాత్రను నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 7 వేల మందికిపైగా యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

రాంబన్‌ జిల్లాలోని చందర్‌కోట్‌లో 5 వేల మంది ఉండిపోయారని వెల్లడించారు. జాతీయ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉన్నందున జమ్మూ నుంచి యాత్రను నిలిపివేశారని తెలిపారు. జమ్మూ బేస్‌ క్యాంప్‌ నుంచి తాజా బ్యాచ్‌ను అనుమతించలేదు. అమర్‌నాథ్‌కు వెళ్లే యాత్రికుల్లో ఎక్కువ మంది జమ్మూకు చేరుకుంటున్నారని వివిధ బస కేంద్రాల్లో వారికి వసతి కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories