కరోనా ను మించి భయపెడుతున్న సమాజపోకడ!

కరోనా ను మించి భయపెడుతున్న సమాజపోకడ!
x
Highlights

కరోనా భయం కన్నా... మానవతను మరుస్తోన్న మనుషుల తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ధైర్యం చెప్పాల్సిన మనుషులు దూరం చేస్తున్న ఘటనలు మానసిక క్షోభను...

కరోనా భయం కన్నా... మానవతను మరుస్తోన్న మనుషుల తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ధైర్యం చెప్పాల్సిన మనుషులు దూరం చేస్తున్న ఘటనలు మానసిక క్షోభను మిగిలిస్తున్నాయి. పేషంట్లు, అనుమానితుల పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. టెస్టులకు వెళ్లినా కరోనా వచ్చిందేమో అన్న అనుమానంతో సమాజంలో తమను తప్పు చేసినట్లు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కరాళ నృత్యంతో అల్లాడుతున్న పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చే వారి దాతృత్వాలు ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు అనవసర అపోహలతో మనుషుల్ని దూరం చేస్తోన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో తెలియని కరోనా వైరస్ పలకరించాల్సిన వారు ముఖం తిప్పుకునేలా చేస్తోంది. కరోనా సోకి డిశ్చార్జ్ అయిన వారితో పాటు అనుమానంతో క్వారంటైన్‌కి వెళ్లిన వారికీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. తోటి వాళ్లే దూరం చేస్తుండటంతో బాధితులు మానసిక క్షోభకు గురవుతున్నారు.

కరోనా అనుమానితులు, పాజిటివ్‌ వచ్చిన వారు వైరస్‌ కంటే, ఇరుగుపొరుగువారు తమను ఏదో తప్పుచేసిన వారిగా చూస్తున్నారనే ఆత్మక్షోభను అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. తమ కుటుంబాల్లో కరోనా సోకినా అనుమానంతో తీసుకెళ్లినా స్థానికంగా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నా వారు ఇంటికి వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక కొన్ని చోట్ల అనుమానంతో తీసుకెళ్లినా సోషల్ మీడియాలో కరోనా పాజిటివ్ అంటూ ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటి వార్తలు కూడా జనాన్ని వివక్షకు గురి చేస్తున్నాయి. అయితే చుట్టుపక్కల వారి గురించి ఆలోచించకుండా వైద్యుల సూచనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాలంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories